TG: మంచిర్యాల జిల్లా కాసిపేట (M) సోనాపూర్ గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా భర్త వేరే అమ్మాయితో డ్యాన్స్ చేశాడని మనస్తాపం చెంది ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. గురువారం గ్రామంలో జరిగిన నిమజ్జన సమయంలో మద్యం మత్తులో ఉన్న భర్త జంగు వేరే అమ్మాయితో డ్యాన్స్ చేశాడు. అది చూసిన భార్య సంధ్య తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో సంధ్య ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగేసింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది.