భార్య ఆత్మహత్య.. గంటలోనే భర్త బలవన్మరణం

AP: నంద్యాల జిల్లా కేంద్రంలో భార్య ఆత్మహత్య చేసుకున్న గంట వ్యవధిలోనే భర్త కూడా విషం తాగి సూసైడ్ చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లా కేంద్రానికి చెందిన కిరణ్‌ (45), మౌనిక (35) దంపతులు 15 ఏళ్లుగా నంద్యాలలోని రోజాకుంటలో నివాసం ఉంటున్నారు. సోమవారం ఉదయం ఇంట్లోనే ఉన్న మౌనిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, భార్య మరణంతో కుంగిపోయిన కిరణ్‌ విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆన్‌లైన్‌లో పెట్టుబడులు, ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యలకు కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕