ప్రియుడి కోసం భర్తను చంపించిన భార్య

బీహార్‌లోని పాట్నా జిల్లా, సిమ్రి గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. డ్రైవర్‌గా పనిచేసే మహమ్మద్ ఇర్ఫాన్ ఇమామ్‌ను తన భార్య ఫౌజియా ఫిర్దోస్, ప్రియుడు కరణ్ కుమార్‌తో కలిసి హత్య చేయించింది. రెండేళ్లుగా కొనసాగుతున్న వివాహేతర సంబంధాన్ని భర్త నిలదీయడంతో, అతని అకౌంట్ నుంచి డబ్బులు తీసి కాంట్రాక్ట్ కిల్లర్లకు ఇచ్చి హత్య చేయించింది. పోలీసులు విచారణలో నిందితురాలు నేరాన్ని అంగీకరించింది. ఫౌజియా, ప్రియుడు కరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, కాంట్రాక్ట్ కిల్లర్ల కోసం గాలింపు కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕