తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో సోమవారం దారుణ హత్య జరిగింది. సినీ ఫక్కీలో ఓ మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసింది. జిల్లాలోని కాటేపల్లి వద్ద స్వామి అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. స్వామి బైక్‌పై వెళ్తుంటే కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో యాక్సిడెంట్ కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. మృతుడి భార్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్యగా నిర్ధారణ అయింది.