TG: కామారెడ్డి జిల్లా హన్మాజిపేట్లో అక్టోబర్ 23వ తేదీన జరిగిన దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో భర్త కాశీరామ్ (26)ను భార్య సవిత, ఆమె ప్రియులు రాము, సంతోష్ కలిసి దారుణంగా హత్య చేశారు. నిందితులు మద్యం మత్తులో ఉన్న కాశీరామ్ను తాడుతో గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని చెరువులో పడేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అయితే, పోస్టుమార్టం నివేదిక, సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిజాన్ని బయటపెట్టారు. అక్టోబర్ 30న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.