కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ తమిళ కాలనీలో రవికుమార్-లలిత దంపతుల మధ్య గొడవ పోలీస్ స్టేషన్కు చేరింది. కౌన్సిలింగ్ తర్వాత కూడా 'భర్త, పిల్లలు వద్దు' అంటూ లలిత తన తాళిని తీసి టేబుల్‌పై పెట్టి, ఇద్దరు కుమార్తెలను స్టేషన్‌లో వదిలి వెళ్లిపోయింది. రవికుమార్ కూడా పిల్లలను వదిలి వెళ్లిపోయాడు. తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో బిక్కుబిక్కుమంటూ ఏడ్చిన పిల్లలను పోలీసులు వారి నానమ్మకు అప్పగించారు. ఈ ఘటనపై స్థానికులు, గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.