వివాహేతర సంబధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. భార్యభర్తలని విడదీసి పిల్లలను తల్లిదండ్రులకు దూరం చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది. ఈ మేరకు ఓ మహిళ తనకు ఫేస్ బుక్ లో పరిచయమైన ప్రియుడి కోసం భర్తను, 4 ఏళ్ల కుమార్తెను విడిచిపెట్టి వెళ్లింది. అయితే ఇప్పుడు ప్రియుడు ఆమెతో ఉండటానికి నిరాకరించడంతో.. మళ్లీ భర్త వద్దకు రావాలని చూసింది. కానీ భర్త "నేను చనిపోతాను కానీ నిన్ను ఉంచుకోను" అని గట్టిగా చెప్పేశాడు.