సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. "నీకు ఏమీ కాదు… భయపడకు, నువ్వు బాగానే కోలుకుంటావు" అని ICU లో బెడ్‌పై ఉన్న భార్య చేయి పట్టుకుని భర్త చెప్పాడు. భార్య తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, భర్త ఆమెను ధైర్యంగా ఉంచే ప్రయత్నం చేశాడు. తన ప్రేమతో, ఆదరాతో ఆమెకి ధైర్యం చెబుతూ తోడుగా ఉన్నాడు. ఈ వీడియో చూసిన వారు భావోద్వేగానికి గురయ్యారు. ఇది చూసిన నెటిజన్లు వారి ప్రేమకు ఎవరూ సాటిరారు అంటున్నారు.