ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్య మూర్తి బాయి భర్త నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి సజీవ దహనం చేసింది. చాలా కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నట్లు తెలిసింది. విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించడంతో, పోలీసులు ఆమెను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఈ ఘటన ఆగస్టు 6న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.