AP: అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన అప్పలనాయుడు (38) హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్యకు ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఆ కోణంలో పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. హత్యకు ప్రియుడు ప్రణాళిక రచించినట్లు అనుమానిస్తున్నారు. అతను పరారీలో ఉన్నట్లు గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు.