AP: కర్నూలు జిల్లా పత్తికొండలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని గొల్ల లింగమూర్తిని రంగమ్మ భర్త నాగేంద్ర చితకబాదాడు. పదేళ్లుగా కొనసాగుతున్న ఈ సంబంధంపై కుటుంబ సభ్యులు పలుమార్లు పంచాయతీలు చేసినా వినకపోవడంతో, రంగమ్మతో కలిసి ఉన్న లింగమూర్తిని నాగేంద్ర రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కొట్టాడు. తీవ్ర గాయాలైన లింగమూర్తి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజుల చికిత్స అనంతరం మరణించాడు. లింగమూర్తి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు 6 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.