యూపీలోని ఆగ్రా జిల్లాలో ఓ మహిళ ప్రియుడి కోసం భర్తను కడతేర్చింది. జితేంద్ర అనే వ్యక్తి తన భార్యతో కలిసి బోండ్లా ప్రాంతంలో నివసిస్తున్నాడు. సదరు మహిళ అంబులెన్స్ డ్రైవర్‌తో విహహేతర సంబంధం ఏర్పడింది. వీరి ఏకాంతానికి భర్త అడ్డుగా ఉన్నాడని కత్తితో గొంతు కోసి చంపింది. అనంతరం ఓ ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లి 65 కి.మీ దూరంలో పడేసింది. అనంతరం ఏం తెలియనట్టు PSలో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణలో అసలు విషయం బయటపడింది.