AP: కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మచిలీపట్నంలో విజయ దుర్గాదేవి అనే మహిళను ఆమె భర్త శ్రీరామ్ గొంతు నులిమి హత్య చేశాడు. తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో అతను ఈ హత్యకు పాల్పడినట్లు తెలిసింది. శ్రీరామ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా, దుర్గాదేవి ఒక దుకాణంలో పనిచేసేవారు. మంగళవారం తెల్లవారుజామున వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన శ్రీరామ్ తన భార్యను హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు.