భర్త గొంతు నులిమి చంపిన భార్య

AP: ఓ మహిళ తన భర్త గొంతు నులిమి హత్య చేసింది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మహేష్, ఈరమ్మలకు 2013లో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇటీవల దంపతుల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. నిన్న రాత్రి 10 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య మరోసారి తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. గొడవ పడుతూనే భర్త మహేష్‌ను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లిన ఈరమ్మ.. అక్కడ అతడి గొంతు నులిమి దారుణంగా హత్య చేసింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్