ప్రియుడితో కలిసి భర్త గొంతు కోసి చంపిన భార్య

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో, వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త జాకీర్ అలీని భార్య హసీనా బేగం తన ప్రియుడు అబ్దుల్ సలాంతో కలిసి హత్య చేసింది. అక్టోబర్ 24న జాకీర్ నిద్రపోతున్నప్పుడు, హసీనా ప్రియుడిని ఇంటికి పిలిపించి, ఇద్దరూ కలిసి దుప్పటితో ఊపిరాడకుండా చేసి, కత్తితో గొంతు కోసి చంపారు. అనంతరం మృతదేహాన్ని షెడ్‌లో పడేశారు. మొదట భూ వివాదాల కారణంగా జాకీర్ కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసిన హసీనా, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడటంతో ఆదివారం ఆమెతో పాటు ప్రియుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్