AP: కర్నూలు జిల్లా ఆదోనిలో సెప్టెంబర్ 18న జరిగిన వీరేశ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం, కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య శైలజ, తన అక్క భర్త గిడ్డయ్యగారి వీరేశ్తో కలిసి భర్తను హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. భర్త వేధింపులు తట్టుకోలేక శైలజ తన బావతో కలిసి ఈ హత్యకు పథకం రచించింది. పొలాల్లోకి తీసుకెళ్లి గొంతు బిగించి, ఛాతీపై కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు కుట్ర పన్నిన భార్య శైలజను, ప్రత్యక్షంగా పాల్గొన్న బావ గిడ్డయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.