కొడుకు కళ్ల ముందే భర్తను నరికి చంపిన భార్య

బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో 12 ఏళ్ల కుమారుడి కళ్ల ముందే భర్తను గొడ్డలితో నరికి చంపిన ఘటన కలకలం రేపింది. ప్రియుడితో పారిపోవాలన్న ఉద్దేశంతో నిద్రలో ఉండగా భర్త బాలో దాస్‌‌ను భార్య ఉషాదేవి కత్తితో నరికేసింది. కుమారుడు శైలేంద్ర ముఖంపై రక్తం పడడంతో మేల్కొని తండ్రి హత్యను చూశాడు. దీంతో నోరు విప్పితే చంపేస్తానంటూ తల్లి బెదిరించడంతో బాలుడు భయపడి.. తెల్లవారాక బంధువుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఉషాను అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్