దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మృతుడు రాజా రఘువంశీ భార్య సోనమ్ కి మేఘాలయ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. అరెస్టు సమయంలో నిందితురాలికి సరైన కారణాలు, సెక్షన్లు తెలపడంలో దర్యాప్తు సంస్థ విఫలమైందని, విచక్షణారహితంగా వ్యవహరించిందని కోర్టు ఆక్షేపించింది