లవర్‌తో కలిసి భర్తను చంపేసిన భార్య.. ప్రియుడు చేసిన ఒక్క మెసేజ్‌తో గుట్టురట్టు

AP: కాకినాడ జిల్లాలో దారుణ హత్య చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన దుర్గాప్రసాద్‌ను అతని భార్య ప్రియుడి సహాయంతో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగించగా, భర్త అడ్డుకోవడంతో హత్యకు కుట్ర పన్నారు. భర్తకు నిద్రమాత్రలు కలిపిన జ్యూస్ ఇచ్చిన భార్య, అనంతరం దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసింది. తరువాత గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులను నమ్మించింది. అయితే తర్వాత ప్రియుడు బాధితుడి కుమార్తెకు పంపిన వాట్సాప్ మెసేజ్‌లో నిజం చెప్పడంతో అసలు విషయం బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్