TG: వరంగల్ పట్టణం బాలాజీనగర్‌లో దారుణ హత్య జరిగింది. యూపీకి చెందిన రితీశ్ సింగ్.. రేష్మా అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారం క్రితం రేష్మా మరో వ్యక్తితో వెళ్లి తిరిగొచ్చింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రితీశ్ సింగ్.. రేష్మాను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.