ప్రియుడితో ఉండగా భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సోమవారం వెలుగు చూసింది. రవి గులాటీ, హిమానీలకు 2010లో వివాహం జరిగింది. అయితే కొంతకాలం తర్వాత హిమానీ మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది. 2018లో హిమానీ తన ప్రియుడితో ఉండగా ఒకసారి దొరికింది. అప్పుడు హిమానీ క్షమాపణలు చెప్పడంతో రవి అంగీకరించాడు. తాజాగా హిమానీ మరోసారి ఓ హోటల్లో ప్రియుడితో పట్టుబడింది. అయితే భార్య స్కూటీకి జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చి.. దాని సహకారంతో లొకేషన్ ట్రేస్ చేసి వారిని పట్టుకున్నానని బాధితుడు వాపోయాడు.