పంట పొలాల మధ్య చిన్నారి వెంట వన్యప్రాణులు (వీడియో)

శ్రీలంకకు చెందిన ఓ చిన్నారికి వన్యప్రాణులతో విడదీయలేని అనుబంధం ఏర్పడింది. పొలాల్లో నడుస్తుంటే ముళ్లపంది, అడవి పిల్లి వంటి జంతువులు ఆమె వెంట వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నారి చెప్పినట్లు వింటున్న జంతువులను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. గతంలో కుక్కల దాడిలో గాయపడిన ముళ్లపందిని ఈ బాలిక రక్షించినట్లు తెలుస్తోంది. జంతువులతో చిన్నారి సాన్నిహిత్యాన్ని చూసి 'రియల్ లైఫ్ డిస్నీ ప్రిన్సెస్' అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్