తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని అర్బన్ పార్కులో కొన్ని రోజులుగా వన్యప్రాణుల వేట కొనసాగుతోంది. పోలీసుల విచారణలో అటవీశాఖ సిబ్బంది ప్రమేయంతోనే దుప్పులను వేటాడినట్లు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నిందితులను గుట్టుచప్పుడు కాకుండా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే అధికారులు నిందితుల వివరాలను గోప్యంగానే ఉంచారు.