ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో చేతిలో ఫోన్ లేదా ఫోన్ మాట్లాడితే పిడుగులు పడే ఛాన్స్ ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే పిడుగు ప్రభావంతో శరీరం గుండా భారీ విద్యుత్ ప్రవాహం జరిగే సమయంలో చేతిలో లేదా జేబులో ఫోన్ ఉంటే బ్యాటరీ తీవ్రంగా వేడెక్కి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అయితే మొబైల్ ఫోన్లు పిడుగులను ఆకర్షిస్తాయనేది మాత్రం అపోహే అని నిపుణులు చెబుతున్నారు.