TG: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను మళ్లీ సిర్పూర్ నుండే పోటీ చేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. కోనేరు కోనప్ప పార్టీలోకి వస్తానంటే తాను వ్యతిరేకించలేదని, పార్టీ అవసరాలను బట్టి చాలా మంది వస్తుంటారని, పోతుంటారని తెలిపారు. పార్టీ ప్రయోజనాలే తనకు ముఖ్యమని, పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు.