EMI ఒక్కరోజు ఆలస్యమైతే ఏం జరుగుతుందో తెలుసా?

నెలవారీ EMI చెల్లింపుల్లో ఒక్కరోజు ఆలస్యమైనా క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుందేమోనని చాలామంది ఆందోళన చెందుతున్నారు. అయితే, ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, EMI ఒక్కరోజు ఆలస్యమైతే వెంటనే క్రెడిట్ స్కోర్ దెబ్బతినదు. సాధారణంగా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు EMI గడువు దాటిన వెంటనే క్రెడిట్ బ్యూరోలకు సమాచారం పంపవు. చాలా సందర్భాల్లో 3 నుంచి 15 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో బకాయిని పూర్తిగా చెల్లిస్తే, ఆలస్య రుసుములు పడే అవకాశం ఉన్నప్పటికీ, క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్