బాహుబలి రెండు భాగాలను కలిపి 'బాహుబలి ది ఎపిక్' గా విడుదల చేసిన తరహాలో, 'ధురంధర్' సినిమాను కూడా క్లబ్ చేసి విడుదల చేయవచ్చనే ఊహాగానాలు సినీ ప్రియుల్లో జోరుగా సాగుతున్నాయి. అయితే 'ధురంధర్' మేకర్స్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో 'కేజీయఫ్' మరియు 'కాంతార' సినిమాల విషయంలోనూ ఇలాంటి చర్చలు జరిగినా, మేకర్స్ మాత్రం క్లబ్ చేసేందుకు ముందుకు రాలేదు. 'పుష్పరాజ్' విషయంలోనూ ఇలాంటి అభిప్రాయాలు వినిపించినా, త్రీక్వెల్ ఉండటం వల్ల ఆగిపోయాయి.