త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా: ఐసెన్‌కోట్

ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐసాక్, నేతన్యాహు ప్రత్యర్థి ఐసెన్‌కోట్‌ను కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆయనకు మ్యాండేట్ జారీ చేస్తూ, పార్లమెంటులో బలనిరూపణకు ఆరు వారాల గడువు ఇచ్చారు. ప్రస్తుతం దేశం ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉందని, వీలైనంత త్వరగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఐసెన్‌కోట్ ప్రకటించారు. తన నాయకత్వానికి మద్దతు లభిస్తే, నెతన్యాహుతో కలిసి పనిచేసేందుకు కూడా తాను సిద్ధమేనని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕