2027 నాటికి బంగారం ధరలు భారీగా పెరుగుతాయా?

2027లో బంగారం ధరలు భారీగా పెరుగుతాయంటూ బాబా వంగా పేరుతో అంచనాలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె పేరుతో ప్రచారంలో ఉన్న ఈ జోస్యాలకు ఆధారాలు లేవు. మరోవైపు జేపీ మోర్గాన్ గ్లోబల్ రీసెర్చ్‌ ప్రకారం.. 2027 నాటికి భారత్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2.62 లక్షల నుంచి రూ.2.82 లక్షల మధ్యకు చేరుతుందని అంచనా. 2026 చివరి నాటికి ఔన్సు బంగారం ధర 6,000 డాలర్లు, 2027 చివరికి 6,300 డాలర్లకు నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, రూపాయి బలహీనత, పండుగల డిమాండ్‌ నేపథ్యంలో ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕