అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను మరోసారి హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిని తెరుస్తారా లేదా తీవ్ర దాడులను ఎదుర్కొంటారా అని ప్రశ్నించారు. కొనసాగుతున్న చర్చల నుండి వైదొలిగితే తీవ్ర సైనిక చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అయితే హర్మూజ్ జలసంధిని అతిత్వరలో తిరిగి తెరిచేందుకు అమెరికా, ఇరాన్, ఒమన్ మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని, బుధవారం నాటికి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు. చర్చలు బాగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.