మళ్లీ పెరగనున్న వడ్డీ రేట్లు?

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. 2027 జూన్‌లోపు RBI మరో 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచవచ్చని గోల్డ్‌మన్ సాక్స్ అంచనా వేసింది. దీంతో రెపో రేటు 6.25 శాతానికి చేరే అవకాశం ఉంది. అటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేటును మరో 25 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం 97 శాతంగా ఉందని సమాచారం. వడ్డీ రేట్ల పెంపుతో బాండ్ మార్కెట్లకు డిమాండ్ పెరిగి, బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕