కేసీఆర్ రాజీనామా చేస్తే తట్టుకునే శక్తి ఉందా: కేటీఆర్

TG: ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రాజీనామా చేయాలని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై BRS నేత కేటీఆర్ ఘాటుగా స్పందించారు. KCRకు రాజీనామాలు కొత్త కాదని, ఆయన రాజీనామా చేస్తే ఢిల్లీనే వణికిందని అన్నారు. ఆ భయంతోనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రాజీనామా చేస్తే తట్టుకునే శక్తి మీ నాయకురాలికే లేదని, మీకు ఉందా అని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. మంత్రుల కొడుకులు దౌర్జన్యాలు చేసినా, ఇతర పార్టీల ఎంపీల కొడుకులు గుద్ది చంపినా పోలీసులు కాపాడుతున్నారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్