దేశంలో రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతున్నాయి. బెంగాల్‌లో మమతా బెనర్జీ ఓటమి, టీఎంసీలో అంతర్గత సంక్షోభాలను కాంగ్రెస్ ఉపయోగించుకుంటోంది. మమతా పార్టీ చీలిక, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో విభజన స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ, ఎన్సీపీ(శరద్ పవార్) తమ పార్టీలను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర కాంగ్రెస్ నేత నానా పటోలే, శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే, ఈ వార్తలను టీఎంసీ, కాంగ్రెస్ తోసిపుచ్చాయి.