ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్‌లో చేరతారా?

TG: పార్టీ ఫిరాయింపు విచారణను ఎదుర్కున్న పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్‌లో చేరతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇటీవల ఆయన కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశానని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం పని చేస్తానని బహిరంగంగానే చెప్పారు. దీంతో తిరిగి సొంతగూటికి చేరుకుంటారనే చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తాజాగా బీఆర్ఎస్‌ సొంతగూటికి చేరుకున్నారు. ఈ క్రమంలో మరికొంత మంది గులాబీ పార్టీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు.

సంబంధిత పోస్ట్