తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ తమకు ద్రోహం చేసిందని డీఎంకే ఆరోపించింది. డీఎంకే కార్యకర్తల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, జూన్ 8న ఢిల్లీలో తలపెట్టిన 'ఇండియా' కూటమి సమావేశంలో పాల్గొనబోమని తేల్చిచెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఇందులో పాల్గొంటున్న కారణంగా తాము దూరంగా ఉంటున్నట్లు స్పష్టం చేసింది. తాము హాజరు కానప్పటికీ, సమావేశంలో పాల్గొనే ఇతర పార్టీలు దేశ సంక్షేమానికి సంబంధించి తమ గళాన్ని వినిపిస్తాయని తెలిపింది.