హర్మూజ్ జలసంధి ప్రాంతంలో చమురు రవాణాకు అంతరాయం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో ప్రపంచ ఇంధన మార్కెట్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌తో పాటు పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగియాయి. అయితే ఈ ప్రభావం ఇప్పుడు భారత్‌పైనా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముడిచమురు ధరలు పెరిగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి పెరగడంతో పాటు రవాణా, నిత్యావసర వస్తువుల ధరలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.