అంచనాలకు తగ్గట్టు ఆడకపోతే ఆటగాళ్ల పేమెంట్లో కోత?

పేలవ ప్రదర్శన చేసే ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు BCCI సిద్ధమవుతోంది. సరిగ్గా ఆడని ఆటగాళ్లకు ఇచ్చే పేమెంట్లో కోత విధించాలని చూస్తోంది. గతేడాది ఆఖరులో స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌లో భారత్ వైట్ వాష్ కావడం, ఆస్ట్రేలియా సిరీస్‌ను 1-3 తేడాతో కోల్పోవడం.. జట్టులో సీనియర్లు దారుణంగా విఫలమవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గొప్ప ప్రదర్శన చేస్తే నగదు రూపంలో బహుమతులు ఇవ్వాలని, లేకపోతే జరిమానాలు విధించేందుకు యోచిస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్