వయసుతో సంబంధం లేకుండా జుట్టు తెల్లబడటానికి జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన కారణాలు, కాలుష్యం వంటివి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. తెల్ల వెంట్రుకలను పీకితే మరిన్ని తెల్లవి వస్తాయనేది కేవలం అపోహ అని డెర్మటాలజిస్ట్‌లు చెప్తున్నారు. జుట్టు కుదుళ్లలో మెలనోసైట్లు రంగును ఉత్పత్తి చేస్తాయని, ఒక కుదురులో ఒకటి కంటే ఎక్కువ వెంట్రుకలు ఉండవచ్చని, తెల్ల వెంట్రుకను పీకితే అదే కుదురు నుంచి వచ్చేవి కూడా తెల్లగానే ఉంటాయని అంటున్నారు. అంతే కానీ మరిన్ని తెల్ల వెంట్రుకలు పుట్టుకొస్తాయనేది అపోహ మాత్రమేనని ఆయన నిపుణులు అంటున్నారు.