కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా రూ.6,000లను రైతులకు మూడు విడతల్లో ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే 21వ విడత నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. దీపావళికి నిధులు విడుదలవుతాయని ఆశించినా కాలేదు. మరో వైపు నవంబర్ మొదటి వారంలో పీఎం కిసాన్ 21వ విడత రూ.2000 విడుదల కానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ స్కీమ్ కోసం ఈ-కేవైసీ, భూమి రికార్డుల ధృవీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది.