రెండు భాగాలుగా రాజమౌళి-మహేష్ బాబు 'వారణాసి'?

దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న 'వారణాసి' సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందని సమాచారం. మొదటి భాగానికి 'వారణాసి: గ్లోబ్ ట్రాటర్' అని, రెండో భాగానికి 'వారణాసి: టైం ట్రాటర్' అని పేర్లు ఖరారు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో రామాయణం అంశాలతో సాగే ఈ అడ్వెంచర్ డ్రామాలో, మొదటి భాగంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే కథ, రెండో భాగంలో కాల ప్రయాణం నేపథ్యంలో కథ సాగనున్నట్లు తెలుస్తోంది. రెండు భాగాలకు కలిపి సుమారు 1500 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్