బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా: షేక్ హసీనా

త్వరలోనే స్వదేశానికి తిరిగి వెళ్తానని, అరెస్టు లేదా హత్య భయం ఉన్నా వెనకడుగు వేయనని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పష్టం చేశారు. రెండేళ్లుగా భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న ఆమె, బుధవారం వర్చువల్‌గా మీడియాతో మాట్లాడుతూ.. తాను అధికారం కోసం కాదని, దేశాన్ని సరైన దారిలో, అభివృద్ధి, లౌకికవాదం దిశగా నడిపించేందుకే తిరిగి వెళ్తానని తెలిపారు. 2024 జూలై, ఆగష్టులో జరిగిన విద్యార్థి ఉద్యమం శాంతియుతమైనది కాదని, కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం దానిని హింసాత్మకంగా మార్చారని ఆమె విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్