త్వరలో 12శాతం జీఎస్టీ శ్లాబ్ ఎత్తివేత?

కేంద్రం త్వరలోనే 12శాతం జీఎస్టీ శ్లాబ్ ఎత్తివేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. పలు వస్తువులను 5శాతం శ్లాబ్‌లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీంతో టూత్ పేస్ట్, గొడుగులు, కిచెన్ సామగ్రి, కుట్టు మెషిన్లు, గీజర్లు, ఐరన్ బాక్సులు, సైకిళ్లు, రూ.వెయ్యిపైన ఉండే రెడీమేడ్ డ్రెస్సులు, రూ.500-రూ.1000 మధ్య ఉండే చెప్పులు, స్టేషనరీ, అగ్రికల్చర్ టూల్స్, వ్యాకిన్స్‌ వంటి వాటి ధరలు తగ్గొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్