రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే బ్యాటరీ పేలిపోతుందా?

రాత్రంతా ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచితే బ్యాటరీ పేలిపోతుందనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే ఆధునిక స్మార్ట్‌ఫోన్‌లలో ఉన్న స్మార్ట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్, ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ ఫీచర్ల వల్ల 100 శాతం ఛార్జ్ అయిన తర్వాత విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. కాబట్టి సాధారణంగా రాత్రంతా ఛార్జింగ్‌లో ఉంచడం వల్ల పెద్ద ప్రమాదం ఉండదు. అయితే ఫోన్‌ను దిండు లేదా దుప్పటి కింద పెట్టి ఛార్జ్ చేయకూడదు. అధిక వేడి బ్యాటరీ పనితీరును దెబ్బతీస్తుంది. అలాగే బ్యాటరీని 20%-80% మధ్య ఉంచడం, పూర్తిగా డిశ్చార్జ్ కాకుండా చూడడం, నాణ్యమైన ఛార్జర్ వినియోగించడం వల్ల బ్యాటరీ ఎక్కువకాలం మన్నుతుంది.

సంబంధిత పోస్ట్