రాబోయే 6 నెలల్లో బంగారం ధర పెరుగుతుందా?.. తగ్గుతుందా?

2026 తొలి అర్ధభాగంలో భారీ పతనం తర్వాత రానున్న ఆరు నెలల్లో బంగారం ధరలపై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) కీలక అంచనాలు వెల్లడించింది. భౌగోళిక ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల నిర్ణయాలు, డాలర్ బలం, పెట్టుబడిదారుల ధోరణి బంగారం ధరలను ప్రభావితం చేయనున్నాయని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే 2026 చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర సుమారు 4,100 డాలర్ల వద్ద ఉండొచ్చని, అయితే 5 శాతం వరకు హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పెరిగితే గోల్డ్ ధరలు మళ్లీ పెరిగే అవకాశముందని ఈ నివేదిక స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్