భారత్, పాక్ మధ్య మరో మ్యాచ్ జరుగుతుందా?

ఆసియాకప్ 2025లో భారత్ సూపర్-4కి అర్హత సాధించిన సంగతి తెలిసిందే. పాక్ సూపర్-4కి చేరుకోవాలంటే సెప్టెంబర్ 17న యుఏఈపై గెలవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్ జట్టు గెలిస్తే.. సెప్టెంబర్ 21న దుబాయ్ వేదికగా భారత్-పాక్ జట్లు తలపడతాయి. ఇప్పటికే గ్రూప్ స్టేజ్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. సూపర్-4 పాయింట్స్ టేబుల్‌లో భారత్, పాక్ తొలి 2 స్థానాల్లో నిలిస్తే ఫైనల్లో మరోసారి ఢీకొంటాయి.

సంబంధిత పోస్ట్