నాలుగు కేంద్ర సంస్థలు బనకచర్ల ప్రాజెక్టును తిప్పి పంపింది నిజం కాదా? అని BRS నేత హరీశ్ రావు ప్రశ్నించారు. 'ఆనాడు కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉండటం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్లు నీళ్లు తీసుకుపోతా అంటే చూస్తు ఊరుకుంటామా? ఇక్కడ ఉన్నది BRS, రాష్ట్ర ప్రయోజనాల కోసం పదవులను గడ్డి పోచలుగా వదులుకున్నోళ్లం. మిగులు జలాలు ఉంటే ఏపీకి ఎన్ని, తెలంగాణకు ఎన్ని కేటాయించారో చెప్పు?' అని లోకేశ్‌ను ప్రశ్నించారు.