'నాకు పోటీగా షాపు పెడతావా'.. మంత్రి అనుచరుడి బూతు పురాణం(వీడియో)

TG: ఖమ్మంలో తనకు పోటీగా క్రాకర్స్ షాపు పెట్టాడని బూతులతో రెచ్చిపోయాడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన లక్ష్మణ్. 'నాకు పోటీగా షాపు పెడతావా.. నిన్ను చంపేస్తా' అంటూ బెదిరింపులకు దిగాడు. పాల్వంచ నుండి వచ్చి ఖమ్మంలో షాపు పెట్టావు.. బ్రతకాలని లేదారా అంటూ యజమానిని బూతులు తిడుతూ దాడికి యత్నించాడు. ఈ క్రమంలోనే పోలీసులకు ఫోన్ చేసి షాపు తొలగించాలని సూచించారు. లక్ష్మణ్ పై చర్యలు తీసుకోవాలని వ్యాపారస్తుల డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్