ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ప్రదర్శన ‘వింగ్స్ ఇండియా 2026’ బేగంపేట్ ఎయిర్‌పోర్టులో నాలుగు రోజుల తర్వాత శనివారం అట్టహాసంగా ముగిసింది. ఈ ప్రదర్శనకు 75,000 మందికి పైగా బిజినెస్ విజిటర్లు, ఒక లక్షకు పైగా సాధారణ ప్రజలు, 2 వేల మంది డెలిగేట్లు హాజరయ్యారు. 150కి పైగా ఎగ్జిబిటర్లు, 30కి పైగా స్టాటిక్, ఫ్లైయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ డిస్‌ప్లేలు, 500కి పైగా మీటింగ్స్ జరిగాయి. ఎయిర్ ఇండియా, అకాసా ఎయిర్, ఎయిర్‌బస్, బోయింగ్, ఎంబ్రేర్, ఏటీఆర్, హెచ్‌ఏఎల్, ఎన్‌ఏఎల్, అదాని ఎయిర్‌పోర్ట్స్ వంటి ప్రముఖ సంస్థలు ఇందులో పాల్గొన్నాయి.