పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి 19 వరకు జరగనున్నాయి. ఈ వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో సమావేశాల షెడ్యూల్ ఖరారైందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలపరచేలా ఈ సమావేశాలు నిర్మాణాత్మకంగా సాగాలని రిజిజు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ సెషన్‌లో మోడీ ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది.