పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. నవంబర్ 25న మొదలై డిసెంబర్ 30 వరకు శీతాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం ప్రకటించారు. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.